మున్నా దర్శకత్వంలో ప్రదీప్ మాచిరాజు హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోవడంలో కాస్త వెనుకబడిందని చెప్పాలి. అయితే అనూప్ రూబెన్స్ అందించిన మ్యూజిక్ మాత్రం సక్సెస్ సాధించింది.
ఇక సినిమాలో నటన పరంగా ప్రదీప్ మాచిరాజు మంచి మార్కులే కొట్టేసాడు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ అంశం గురించి చర్చ నడుస్తోంది. అది మరేదో కాదు. ఈ సినిమా కోసం ప్రదీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడు అనేదే.. నిజానికి ప్రదీప్ ఈ సినిమాకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. తనకు కథ నచ్చిందని.. వేరియేషన్స్ కూడా నచ్చాయని అందుకే సినిమా చేశాడని సమాచారం.