ఎఫ్2 సినిమాలో మెహ్రీన్, తమన్నకు తల్లిగా నటించింది ప్రగతి. ఇప్పుడు ఎఫ్3లో కూడా వాళ్లకు తల్లిగా నటిస్తోంది. ఆ హీరోయిన్లతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంది ఈ నటి. రియల్ లైఫ్ లో కూడా వాళ్లిద్దరూ తనకు పిల్లల్లానే అనిపిస్తారని చెబుతోంది. వాళ్ల కూడా ప్రగతిని తల్లిలానే చూస్తారంట.
“మెహ్రీన్, తమన్న నాకు ఇద్దరు పిల్లలుగా మారిపోయారు. సెట్స్ లో ఏమాత్రం ఇబ్బంది అనిపించినా వచ్చి నాకు చెబుతారు. వాళ్లకు ఏమైనా కావాలన్నా కూడా నాకే చెబుతారు. ఒక్కోసారి అమ్మను మిస్ అయినట్టు అనిపిస్తే నా దగ్గరకే వస్తారు. దాదాపు నాలుగేళ్ల నుంచి మా బాండింగ్ కొనసాగుతోంది.”
హీరోయిన్లు ఇద్దర్లో తమన్న గుడ్ గర్ల్ అంటోంది ప్రగతి. మెహ్రీన్ మాత్రం చాలా అల్లరి చేస్తుందట. ఏదో ఒకటి వాగుతూనే ఉంటుందట. ఎక్కువగా మాట్లాడకు అని తమన్నా సర్దిచెబుతుందట. ఇలా హీరోయిన్లు ఇద్దరూ రెండు రకాలు అని చెప్పుకొచ్చింది ప్రగతి.
ఇక సునీల్ గురించి స్పందిస్తూ.. పుష్ప తర్వాత సునీల్ మరో బ్రేక్ అందుకోబోతున్నాడని జోస్యం చెప్పింది ఈ నటి. పుష్ప సినిమాలో సీరియస్ విలన్ గా కనిపించిన సునీల్, ఎఫ్3తో తన వింటేజ్ కామెడీని చూపిస్తారని అంటోంది.