క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అమ్మడు ప్రగ్యా జైస్వాల్ . మొదటి సినిమాలోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది ప్రగ్యా. కానీ హీరోయిన్ గా మాత్రం అంతగా నిలదొక్కుకోలేక పోయింది. జయజానకినాయక, గుంటూరోడు, ఆచారి అమెరికా యాత్ర వంటి సినిమాలు చేసినప్పటికి ప్రగ్యా కు అంతగా పేరును మాత్రం తీసుకురాలేకపోయాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ అమ్మడు అవకాశాలకోసం ఎదురుచూస్తుంది. అంతే కాదు సినిమాలు లేకపోయినా హాట్ హాట్ గా పొట్టి డ్రెస్ లు వేసుకుంటూ ఫోటో షూట్ లు చేస్తూ ఆ ఫోటోలను నెట్టింట్లో పోస్ట్ చేస్తుంది. ప్రగ్యా ఫోటో లు చూసిన నెటిజన్లు తెగ ముద్దొచ్చేస్తోందంటూ ఇష్టాన్ని కామెంట్స్ రూపంలో చెప్పుకుంటున్నారు.