శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన చిత్రం ఢీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు మంచి వసూళ్ల ను కూడా రాబట్టింది. అయితే ఈ మధ్య సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు శ్రీను వైట్ల, మరోవైపు మంచు విష్ణు కూడా ఢీ ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కావాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ కాంబినేషన్ లో మళ్లీ సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అనౌన్స్ కూడా చేశారు. ఈ సినిమాకు డబుల్ డోస్ అనే టైటిల్ ను ప్రకటించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇద్దరి పేర్లు అనుకున్నారట. ప్రధాన కథానాయిక పాత్ర కోసం అనూ ఇమాన్యుయెల్ లేదా ప్రగ్యా జైస్వాల్ ను తీసుకోవాలనుకుంటున్నారట. కాగా ప్రగ్యా అయితే బాగుంటుందని శ్రీనువైట్ల డిసైడ్ అయ్యాడట. ఎప్పటికే మంచు విష్ణు ఆమెను ఒప్పించడట. కాగా ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది.