ప్రహ్లాద్ సింగ్ పటేల్, కేంద్రమంత్రి
రాష్ట్రంలో అత్యంత అవినీతి పాలన నడుస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా డిమాండ్ చేస్తున్న కేసీఆర్.. ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయి డీపీఆర్ ఎందుకు ఇవ్వడం లేదు. నీటి కేటాయింపులు లేకుండా జాతీయ హోదా ఎలా ఇస్తారు.
కేసీఆర్ ఇచ్చి మరిచిపోయిన హామీలను గుర్తు చేసేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారు. ఆర్డీఎస్ విషయంలో కేసీఆర్ సర్కార్ ఇచ్చిన హామీ ఏమైంది. సమస్య పరిష్కారానికి బోర్డు ఏర్పాటు చేస్తాం. ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకు నీరందిస్తాం. 2014 నుంచి అధికారంలో ఉన్న కేసీఆర్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ను ఎందుకు పూర్తిచేయలేకపోయారు.
కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ మిగతా ప్రాజెక్టులపై కేసీఆర్ ఎందుకు చూపడం లేదు. రాష్ట్రంలో హత్యలు, దాడులు పెరిగిపోతున్నాయి. ఇది సమంజసం కాదు. నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్ష కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 8 ఏండ్లు గడిచినా నీళ్లు, నిధుల, నియామకాల సమస్యకు పరిష్కారం కాలేదు.
కుర్చీ వేసుకుని కూర్చొని ఆర్డీఎస్ పూర్తి చేస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారు. ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు బండి సంజయ్ పాదయాత్ర చేయడం అభినందనీయం.