ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరో నాకు తెలియదంటూ వ్యాఖ్యానించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి కోవర్టు అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలవదని.. ఆ విషయం అందరికీ తెలుసన్నారు.
కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్ లో మూడు లక్షల ఓట్లు ఉంటే.. మూడు వేల ఓట్లు పడ్డాయని ఎద్దేవా చేశారు. బీజేపీ పార్టీ తెలంగాణలో ఎక్కడా లేదని, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తూర్చుకపోయిందని.. అందుకే జాతీయ పార్టీ పెట్టారన్నారు.
ఇప్పుడున్న పార్టీలన్నీ రెండు మూడు కుటుంబాలకు, ఆయా కులాలకే పరిమితం అయ్యాయని విమర్శించారు. అయితే ప్రజాశాంతి పార్టీ అలా కాదన్నారు పాల్.
తాను బీసీని అని, దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. 90 శాతం ప్రజలు తనకు సపోర్ట్ గా ఉన్నారని చెప్పారు. అంబేద్కర్ పుట్టినరోజునే నూతన సెక్రటేరియట్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు కేఏ పాల్.