ఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు కేంద్రం దసరా కానుకగా బోనస్ ప్రకటించింది. దసరాకు రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ అందించే కీలక నిర్ణయానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో దాదాపు 11 లక్షల పైచిలుకు రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ దిల్లీలో ప్రకటించారు.
ఆరేళ్ల నుంచి రైల్వే ఉద్యోగులకు పెద్ద మొత్తంలో నిలకడగా ఏటా బోనస్ ఇస్తూ వస్తున్నారు. ఈ ఏడాది 11.52 లక్షల మంది ఉద్యోగులు 78 రోజుల బోనస్ పొందనున్నారు. రైల్వేలో మెరుగైన ఫలితాలకు ఇది రివార్డు లాంటిది’’ అని జావడేకర్ అన్నారు.