జనసేన నేత సినీ నటుడు నాగబాబు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ల మధ్య వైరం ముదురుతోంది. పవన్ కళ్యాణ్ ఒక ఊసరవెల్లి అంటూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా నాగబాబు ఫైర్ అయ్యారు. ఇదే విషయమై నాగబాబు వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందించారు.
గౌరవనీయులైన నాగబాబు గారికి… మీ తమ్ముడు మీద ఉన్న ప్రేమ నాకు అర్థం అయింది. నాకు దేశం మీద ఉన్న ప్రేమని మీరు అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చు.. కానీ మీ భాష రాదు అంటూ చేతులు జోడించి నమస్కరిస్తున్న ఒక ఈమోజీ ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అయితే ప్రకాష్ రాజ్ రిప్లై పై నాగబాబు స్పందిస్తాడో లేక ఇక్కడితో ఈ గొడవ సద్దుమనిగిస్తాడో చూడాలి.
@NagaBabuOffl గౌరవనీయులైన నాగబాబుగారికి,
మీ తమ్ముడు మీద ఉన్న ప్రేమ నాకు అర్థం అయ్యింది. నాకు దేశం మీద ఉన్న ప్రేమని మీరు అర్థం చేసుకోండి.
నాకు తెలుగు భాష వచ్చు కానీ మీ భాష రాదు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻— Prakash Raj (@prakashraaj) November 28, 2020