గత కొద్దీ రోజులుగా మీడియా లో ఎక్కువగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు రిచా చద్దా. సైనికులు గురించి ఆమె చేసిన పోస్ట్ వివాదాలకు దారి తీయడంతో అగ్రనటులందరు ఆమె పై విమర్శలు చేస్తున్నారు.
అటు బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ ప్రముఖులు ఆమె పై ఆగ్రహం వ్యక్తం చేసారు. దీని గురించి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సైతం నెటిజన్లతో గొంతు కలిపాడు. రిచా చద్దాపై ఘాటు విమర్శలు చేశాడు. ఈ పోస్ట్.. తన భావాలను గాయపరిచిందని వ్యాఖ్యానించాడు. సైనిక బలగాలను మించి మరొకటి లేదని స్పష్టం చేశాడు.
దేశ సరిహద్దుల్లో నిత్యం పహారా కాసే సాయుధ బలగాలకు కృతజ్ఞత చూపడానికి మించనదేమీ లేదని పేర్కొన్నాడు. వారి పట్ల కృతజ్ఞతగానే ఉండాలని సూచించాడు. వారు సరిహద్దుల్లో ఉండటం వల్ల తాము సురక్షితంగా జీవిస్తోన్నామని చెప్పాడు అక్షయ్ కుమార్.
అక్షయ్ కుమార్ చేసిన ఈ కామెంట్స్‌కు దక్షిణాది విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించాడు. అక్షయ్ కుమార్ నుంచి ఇలాంటి రియాక్షన్‌ను తాను ఊహించలేదని పేర్కొన్నాడు. రిచా చద్దా మన దేశానికి చెందిన పౌరురాలేనని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారాయన.
దీన్ని అక్షయ్ కుమార్, రిచా చద్దాకు ట్యాగ్ చేశారు. మీ దేశం, మా దేశం అనే తేడాలేదని, మనం అందరం ఒక దేశ పౌరులే అనే అర్థం వచ్చేలా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.