బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మహారాష్ట్ర సర్కార్ పై పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే కొంతమందిని నెటిజన్లు ఆమెను రాణి లక్ష్మీ బాయి తో పోలుస్తూ ట్వీట్ లు చేస్తున్నారు. రాణీ లక్ష్మీబాయి శౌర్యం, త్యాగాలను సినిమా ద్వారా చూపించానంటూ, నిజజీవితంలోనూ తల వంచనంటూ ట్వీట్ చేసింది. దీనిపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు.
ఒక్క సినిమాతో కంగనా తనను రాణి లక్ష్మీ బాయి తో పోల్చుకుంటే పద్మావతిగా నటించిన దీపికా,అక్బర్ గా నటించిన హృతిక్ రోషన్, భగత్ సింగ్ గా అజయ్, అశోకగా నటించిన షారుక్ , మంగల్ పాండే గా నటించిన అమీర్ ఖాన్ మోడీగా నటించిన వివేక్ కూడా ఆ గొప్పవారితో పోల్చొచ్చు అంటూ ట్వీట్ చేశాడు.
అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లో పరిస్థితులన్నీ మారిపోయిన సంగతి తెలిసిందే. ఒకవైపు కంగనా రనౌత్ శివసేన నేతలపై విమర్శలు చేయడం,ముంబై కి వెళ్లడం, డ్రగ్స్ కేసులో ఆమె పేరువినబడుతుందటం వంటి ఘటనలు ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.
#justasking pic.twitter.com/LlJynLM1xr
— Prakash Raj (@prakashraaj) September 12, 2020