కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. సోనియా, రాహుల్ గాంధీలు సుప్రీం కోర్టుకు వెళ్లారని, కానీ నేషనల్ హెరాల్డ్ కేసును కొట్టివేయలేదని ఆయన అన్నారు.
ప్రస్తుతం ఇద్దరు గాంధీలు బెయిల్ పై ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. నరేంద్ర మోడీ సీఎంగా ఉన్నప్పుడు గాంధీలు ఆయన్ని వేధించారని ఆయన తెలిపారు.
ధరల పెంపుపై పార్లమెంట్ ను కాంగ్రెస్ నేతలు స్తంభింపజేయడంపై ఆయన మండిపడ్డారు. ధరల పెంపుపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పినా సభను కాంగ్రెస్ నేతలు నడవనీయలేదన్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు సోనియాగాంధీ నిన్న హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈడీ, కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శిస్తూ కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టారు.