పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటించింది ప్రణీత. కరోనా టైమ్ లో పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ, గతేడాది జూన్ లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాప పేరు అర్నా.
అలా కొన్నాళ్లుగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ, ఇప్పుడు మరోసారి సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఈ నటి, మలయాళ ఇండస్ట్రీలోకి ఎంటరైంది.
D148 అనే సినిమాకు సైన్ చేసింది ప్రణీత. తాజాగా మూవీ ఓపెనింగ్ కూడా జరిగింది. షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇదే విషయాన్ని ప్రణీత, తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రకటించింది. షార్ట్ గ్యాప్ తర్వాత ప్రణీత రీఎంట్రీ ఈ సినిమాతోనే జరుగుతోంది.
రతీష్ రేఘునందన్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిలీప్ హీరో. నీతా పిళ్లై, షైన్ టామ్ చాకో, అజ్మల్ అమీర్, మనోజ్ కె జయన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇఫ్ఫార్ మీడియాతో కలిసి సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.