కరోనా సమయంలో ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేసి తనలో ఉన్న మానవత్వాన్ని చాటి చెప్పారు హీరోయిన్ ప్రణీత. అంతకుముందు వరకూ ప్రణీత ఓ నటిగానే అందరికీ తెలుసు.
కానీ లాక్ డౌన్ సమయంలో ప్రణీత చేసిన సేవలతో అందరికి ఆమెపై ఉన్న అభిప్రాయాన్ని మార్చేశాయి. అయితే ప్రణీత తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ గా మారింది. ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో భాగంగా ప్రణీత తన ముఖానికి సూదులు గుచ్చుకుని ఉన్న ఫోటోని పోస్ట్ చేసింది. ఇక ఆ ఫోటో చూసిన నెటిజన్లు సినీ అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.