ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అభినందనల సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అందరి కంటే ముందుగా సందేశం పంపిన వారిలో పొలిటికల్ ఎనలిస్ట్, రాజకీయ నేత ప్రశాంత్ కుమార్ ఉన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రణాళికను ప్లాన్ చేసింది కూడా ప్రశాంత్ కుమారే. ”భారత దేశ ఆత్మను కాపాడేందుకు నిలబడినందుకు ఢిల్లీకి కృతజ్ఙతలు” అంటూ ప్రశాంత్ కుమార్ ట్వీట్ చేశారు. మొన్నటి వరకు బీజేపీకి దాని మిత్ర పక్షం జేడీ(యు)తో రాసుకొని పూసుకొని తిరిగిన ప్రశాంత్ కుమార్ ఇప్పుడు ఆ పార్టీలకు దూరంగా ఉంటున్నారు. సీఏఏ ను వ్యతిరేకిస్తూ ఆయన అభిప్రాయాన్ని బహిరంగానే వ్యక్తపర్చారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దగ్గరి అనుచరుడు, కొన్ని నెలల క్రితం జేడీ(యు) లో చేరిన ప్రశాంత్ కుమార్…సీఏఏ, ఎన్.ఆర్.సి ని నితీష్ కుమార్ సమర్ధించడంతో విభేదించి ఆ పార్టీకి దూరమయ్యారు.