కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కాకుండా.. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశం.. కాంగ్రెస్ లోకి ప్రశాంత్ కిశోర్ చేరిక. సోనియాగాంధీతో పలు దఫాల భేటీలు, సీనియర్ నాయకులతో మంతనాల తర్వాత అనేక కథనాలు తెరపైకి వచ్చాయి. తెలంగాణలోనూ ప్రకంపనలు రేపింది ఈ అంశం. ఎందుకంటే.. కేసీఆర్ కు పీకే పని చేయడమే కారణం. కాంగ్రెస్ లో చేరితే.. రాష్ట్రంలో వ్యతిరేకంగా ఎలా పని చేస్తారనేది హాట్ టాపిక్ అయింది.
కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఒక్కటేనని బీజేపీ జోరుగా ప్రచారం చేస్తోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు ఖండిస్తూ.. పీకే తమ పార్టీలో చేరినా కార్యకర్తగానే పని చేస్తారని అన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు ఓకే అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పీకే ఎలాంటి స్టెప్ తీసుకుంటారా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. కాంగ్రెస్ లో చేరిక విషయంపై క్లారిటీ ఇచ్చారు.
I declined the generous offer of #congress to join the party as part of the EAG & take responsibility for the elections.
In my humble opinion, more than me the party needs leadership and collective will to fix the deep rooted structural problems through transformational reforms.
— Prashant Kishor (@PrashantKishor) April 26, 2022
పార్టీలో చేరాలని.. ఎన్నికల బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనను తాను తిరస్కరించినట్లు ప్రకటించారు ప్రశాంత్ కిశోర్. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన పోస్ట్ పెట్టారు. తాను కాంగ్రెస్ లో చేరడం కంటే.. ఆ పార్టీకి సమర్ధ నాయకత్వం అవసరమని సూచించారు.
Following a presentation & discussions with Sh. Prashant Kishor, Congress President has constituted a Empowered Action Group 2024 & invited him to join the party as part of the group with defined responsibility. He declined. We appreciate his efforts & suggestion given to party.
— Randeep Singh Surjewala (@rssurjewala) April 26, 2022
ఇటు ఏఐసీసీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. పీకే కాంగ్రెస్ లో చేరడం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో చేరాలన్న సోనియా ఆహ్వానాన్ని పీకే తిరస్కరించినట్లు తెలిపారు. పీకే నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని అన్నారు.