పశ్చిమ బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ పార్టీ టీఎంసీని ఓడించాలన్న పట్టుదలతో ఉంది బీజేపీ. ఇప్పటికే రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని రకాలుగా సన్నద్ధమవుతుంది. పదుల సంఖ్యలో టీఎంసీ నుండి ఎమ్మెల్యేలు, మంత్రులు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై భారీ అంచనాలతో కేంద్రమంత్రి అమిత్ షా వ్యూహాలకు పదునుపెడుతుంటే… ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన సవాల్ విసిరారు. బీజేపీ తన అనుకూల మీడియాతో ప్రచారం చేసుకుంటూ లేని హైప్ సృష్టించుకునే ప్రయత్నం చేస్తోందని, కానీ రెండంకెల సీట్లు కూడా సాధించలేదని వ్యాఖ్యానించారు. కావాలంటే తన ఈ ట్వీట్ ను సేవ్ చేసుకోండని, తను చెప్పిన అంకెల కన్నా కనీసం ఒక్కటి ఎక్కువొచ్చిన తను ఈ బాధ్యతల నుండి తప్పుకుంటానని ప్రశాంత్ కిషోర్ సవాల్ చేశారు.
ఫిబ్రవరి 11, మంగళవారం రోజున ప్రజల సత్తా ఎంటో చూసేందుకు రెడీగా ఉండాలని మరో ట్వీట్ చేశారు.
ప్రజల మూడ్ ను అంచనా వేస్తూ, ప్రజల నాడిని పక్కాగా పసిగట్టగలడన్న పేరున్న ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ ఈ సవాల్ సంచలనంగా మారింది.