గత కొద్ది రోజులుగా ఏపీలోని సోషల్ మీడియాలో విచిత్ర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ప్రశాంత్ కిషోర్ మ్యాజిక్కులతో లాజిక్కులతో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్… అదే పీకే మ్యాజిక్కులకు, లాజిక్కులకు తలొగ్గుతుందా లేదా అతను చేసే రాజకీయ మాయలకు ప్రభావితం అవుతుందా అనేవి ఆసక్తికర పరిణామాలు.
ప్రశాంత్ కిశోర్ గత ఎన్నికల్లో జగన్ తో కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ ఒప్పందం ముగిసిపోయిన తర్వాత కూడా ఎందుకు ప్రభుత్వంలో కీలక పాత్రను పోషించాలనుకుంటున్నాడు. సరే పోషించినా పర్లేదు ఎందుకంటే వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలోకి రావటానికి కృషి చేశాడు కాబట్టి. కానీ రాబిన్ శర్మ అనే తన సహచరుణ్ణి ఎందుకు టీడీపీ పార్టీ కి సలహాదారునిగా పంపించాడు. ఎందుకు అటు ఇటు రెండు పార్టీలకు చెక్ పెడుతున్నాడు అనేది ఒక అర్ధం కానీ విషయం.
పీకే ఇటు ప్రభుత్వంలో, అటు ప్రతి ప్రతి పక్షంలో తానే కీలక పాత్రా పోషించాలని అనుకుంటున్నాడా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అలానే కనిపిస్తున్నాయి. తన సహచరునితో టీడీపీ ఒప్పందం కుదుర్చుకునేలా చేసి అటు ప్రతిపక్షంలోను, ఇటు తన టీం సభ్యులను ప్రభుత్వంలో నియమించడం ద్వారా అటు అధికార ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర పోషించాలని అనుకుంటున్నాడు.
ఏది ఏమైనా వీళ్లిద్దరు పీకే రాబిన్ శర్మ అటు ఇటు వ్యవహరిస్తూనే ఢిల్లీలో కలుసుకుంటూ అటు టిడిపి పని తీరుపై ఇటు ప్రభుత్వ పని తీరుపై సమాచారాన్ని పంచుకుంటూ ఇద్దరు కలిసి ఇరు పార్టీలను తికమకపెడుతున్నట్టుగా అనిపిస్తున్నది.