కృష్ణవంశీ సినిమా అనగానే ఒక పెద్ద ఫ్యామిలీ, వాళ్ల మధ్య ఎమోషన్స్, వసుదైక కుటుంబ విలువలు చూపిస్తూ… ప్రతి సీన్ లో ఒక 20 నుంచి 30 మంది ఆర్టిస్టులు కనిపిస్తూ ఉంటారు. ఈ ట్రాక్ లో ఎన్నో హిట్స్ అందుకున్న కృష్ణవంశీ తర్వాత ఆ స్థాయిలో ఫ్యామిలీ సినిమాలు చేసింది మాత్రం శ్రీకాంత్ అడ్డాలనే. హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఈ డైరెక్టర్స్ బాగా ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు మారుతీ ఈ లిస్ట్ లో చేరుతూ చేసిన సినిమా ప్రతిరోజు పండగే. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశిఖన్నా మెయిన్ లీడ్స్ లో నటిస్తున్న ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ అయ్యింది.
థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి శ్రీకృష్ణ వాయిస్ ప్రాణం పోసింది. ప్రతి రోజు పండగే అంటూ సాగిన ఈ సాంగ్ మధ్యలో చూపించిన విజువల్స్ బాగున్నాయి. ఒక పెద్ద ఫ్యామిలీ, అందులో తాత మనవడు మధ్య జరిగే కథగా ఈ సినిమా తెరకెక్కుతోందని అర్ధమవుతోంది. తేజ్ అండ్ సత్యరాజ్ మధ్య వచ్చిన సీన్స్ చాలా బాగున్నాయి. కుటుంబమంతా కలిసి ఉంటే ఎలా ఉంటుందో ప్రతిరోజు పండగే సినిమాలో చూపించబోతున్నారు. మరి ఈ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటరైనర్ ప్రేక్షకులని ఎంత వరకూ మెప్పిస్తుందో చూడాలి.