సాయిధరమ్ తేజ్ హీరోగా, రాశికన్నా హీరోయిన్ గా వస్తున్న సినిమా ప్రతిరోజు పండగే. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన సాంగ్స్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. పల్లెటూరి వాతావరణంలో బంధాలు, అనుబంధాలు మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో సత్యరాజ్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఎప్పటి నుంచో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సాయిధరమ్ తేజ్ ఈ సినిమా పై గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ‘యు ఆర్ మై హై ‘ అంటూ ఓ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సాంగ్ లో రాశికన్నా, తేజ్ చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. సాంగ్స్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాను స్టోరీ పరంగా దర్శకుడు మారుతీ ఏ మేర ఆకట్టుకుంటాడో చూడాలి.
ఈ పాటను రాశికన్నా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. రాశికన్నా పెట్టిన ఆ వీడియో పోస్ట్ ఇదే…