సాయిధర్మ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ప్రతిరోజుపండగే. డిసెంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా లో సాయిధర్మ తేజ్ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. గోదావరి జిల్లాలో ఒక విలేజ్ లో జరుగుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా కనిపోయిస్తుంది. ఇప్పటికే రేలీజ్ అయిన టీజర్ తో మంచి టాక్ తెచ్చుకుంది ఈ మూవీ. తాజాగా ట్రైలర్ ను రేలీజ్ చేసింది చిత్ర యూనిట్. సత్య రాజ్ ప్రధాన పాత్రలో సాయిధరమ్ తేజ్ కు తాత గా నటిస్తున్నారు. ఎక్కడో విదేశాల్లో ఉంటున్న పిల్లలను ఇంటికి తెప్పించటానికి సత్యరాజ్ ఆరోగ్యం బాలేదని పిల్లలందరిని పిలిపించి వారి మధ్య బంధాలు, అనుబంధాలు గురించి దర్శకుడు మారుతీ చూపించే ప్రయత్నం చేసినట్టు ట్రైలర్ లో అర్థం అవుతుంది. శర్వానంద్ హీరోగా వచ్చిన శతమానంభవతి సినిమాని పొలిఉన్నప్పటికీ దర్శకుడు మారుతీ తన మార్క్ ను చూపిస్తూ కామెడీ పండించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలంటే డిసెంబర్ 20 వరకు అలగాల్సిందే. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు.