మహాభారత్ సీరియల్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అయితే ఆ సీరియల్ లో భీముడిగా నటించిన ప్రవీణ్ కుమార్ సోబ్తి మంగళవారం గుండెపోటు తో మృతి చెందారు. ప్రవీణ్ కుమార్ సోబ్తి వయసు 74 ఏళ్ళు.
బీఆర్ చోప్రా తెరకెక్కించిన మహాభారత్ సీరియల్ లో భీముడి పాత్రతో అందరిని ఆకట్టుకున్న ప్రవీణ్ కుమార్ సోబ్తి ఆ తరువాత కొన్ని హిందీ చిత్రాలలో నటించారు.
రక్ష చిత్రంతో కెరీర్ ప్రారంభించిన ప్రవీణ్ కుమార్ సోబ్తి 2013 వరకూ నటించారు. బాలీవుడ్‌తో పాటు తమిళంలో కమల్‌హాసన్ మైఖేల్ మదన కామరాజు, తెలుగులో కిష్కిందకాండ చిత్రాల్లో నటించారు.
ప్రవీణ్ కుమార్ సోబ్తి మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.