నమ్మకాలే జీవితాన్ని నడిపిస్తాయి. నమ్మకం సానుకూలమైతే సక్రమ మార్గంలో వెళ్తాం.కాకుంటే అక్రమ మార్గంలో వెళ్తాం. అందుకే నమ్మకమే జీవితం అంటారు. దేవుడు విషయానికి వస్తే ..ఉన్నాడని నమ్మే ఆస్తికులు ఎంతమంది ఉన్నారో, ఎక్కడున్నాడో చూపించని వాదించే నాస్తికులు కూడా ఎక్కువ మందే ఉన్నారు. అది వాళ్ళ వాళ్ళ విశ్వాసాలు,అనుభవాలు, పెరిగిన వాతావరణం మీద ఆధార పడి ఉంటాయి.
సడన్ గా సీన్లోకి దేవుడు ఎందుకొచ్చాడంటే..!? ఓ వ్యక్తి చిన్నప్పటి నుంచి దేవుణ్ణి పిచ్చిగా నమ్మాడు. ప్రార్థనలు చేసాడు.అయితే ఎంతగా నమ్మినా,ఎన్ని పూజలు చేసినా దేవుడు కరుణించలేదు, అనుకున్న పనులు నెరవేరలేదు, అతని కష్టాలు తీరలేదు. దీంతో దేవుడిపై కోపం పెంచుకున్నాడు. ఆస్తుకుడు కాస్తా నాస్తికుడిగా మారిపోయాడు.
ఆలయాలను ధ్వంసం చేయడం ప్రారంభించాడు. మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ నగరంలోని రెండు దేవాలయాలను ధ్వంసం చేసినందుకు 24 ఏళ్ళ వ్యక్తని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
వివిరాల్లోకి వెళ్తే…చిన్న తనంలో జరిగిన ప్రమాదంలో తన కన్నుపాడైందని, కోలుకోవాలని చేసిన ప్రార్థనలు నెరవేరకపోవడంతో ఇటీవల తాను ఈ విధ్వంసాలకు పాల్పడ్డానని ఆవ్యక్తి అధికారుల ముందు నేరం ఒప్పుకున్నాడు.
ఇటీవల చందన్ నగర్, ఛత్రిపురలోని రెండు దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయని,ఒక విగ్రహాన్ని అపవిత్రం చేసాడని అదనపు డీసీపీ పోలీస్ కమిషనర్ ప్రశాంత్ చౌబే చెప్పారు. నిందితుడి మానసిక స్థితి సరిగలేదని వెల్లడించారు.అతని తండ్రి చిన్న హార్డ్ వేర్ స్టోర్ నడుపుతున్నాడని …సమస్య చాలా సున్ని తమైందని లోతుగా విచారణ జరుగుతోందని ఆయన చెప్పారు. అతనిపై ఐపీసీ 295ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసామని తెలిపారు.