బెయిల్‌ ఊహించే కొత్త కేసు? - Tolivelugu

బెయిల్‌ ఊహించే కొత్త కేసు?

 

మీడియా లెజెండ్ రవిప్రకాశ్ కేసులో ఈరోజు బెయిల్‌ వస్తుందని ముందే ఊహించారా…? అప్పటి వరకు కస్టడీకి విఫలయత్నం చేసి… రాదని తెలిశాకే కొత్త కేసు తెరమీదకు తెచ్చారా…? రవిప్రకాశ్‌ను జైలులో ఉంచటమే అంతిమ లక్ష్యమా…? కొత్త కేసులో బెయిల్‌ వచ్చే లోపు మరో కేసు వేయడానికి వ్యూహారచన ఇప్పటికే పూర్తయిందా…?

నిత్యం కేసులు, కోర్టు వ్యవహారాల్లో ఉండే పోలీస్ బాస్‌లకు ఏ కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉందో వాదనలను బట్టి చెప్పేస్తుంటారు. అది కామన్. అందుకే అలందా మీడియా 18కోట్ల నిధుల కేసులో కస్టడీకి కోర్టు నో చెప్పటం, హైకోర్టు నవంబర్‌ 2 వరకు ఎలాంటి చర్యలు తీసుకోరాదని చెప్పటంతో… ఎలాగు బెయిల్ వస్తుందని ముందే ఊహించిన పోలీసులు కొత్త కేసు తెరమీదకు తెచ్చారని జర్నలిస్ట్‌ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ముందుగానే ఊహించి కొత్త కేసు పెట్టారు. ఇంతవరకు రిమాండ్ రిపోర్ట్, కేసుకు సంబంధించిన ఎఫ్.ఐ.ఆర్ కూడా రవిప్రకాశ్ తరుపు లాయర్లకు గానీ, కుటుంబ సభ్యులకు కానీ ఇవ్వలేదని మండిపడ్డారు. అయితే, కొత్త కేసులో కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. దీంతో మరో కేసును తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలా ఎన్ని రోజులు జైలులో ఉంచుతారు, ఎన్ని అక్రమ కేసులు పెడతారు అంటూ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

తెలంగాణ జర్నలిస్ట్‌లు విడుదల చేసిన అధికారిక ప్రెస్‌రిలీజ్‌ ఇదే:

తెలంగాణ లో జర్నలిస్టుల పరిస్థితి దయనీయంగా మారింది. రెండో సారి కే. సి. ఆర్ అధికారం లోకి వచ్చాక జర్నలిస్టులను టార్గెట్ చేస్తున్నారు. తన అసమర్థ పాలనను కప్పి పుచ్చుకోవడానికి మీడియా మొత్తాన్ని తన మాఫియా చేతుల్లో పెట్టిన కే.సి.ఆర్.. నిజమైన జర్నలిస్టులను వేధింపులకు గురి చేస్తున్నారు. పథకం ప్రకారం జర్నలిస్టులను అణగదొక్కుతున్నారు. 500 మంది జర్నలిస్టుల పై తెలంగాణ లో ఇప్పటికే పలు కేసులు మోపారు. ఇక లాభం లేదని ఏకంగా టివి9 వ్యవస్థాపకులు రవిప్రకాష్ పై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపినారు. ఎదైనా సంస్థ లోని లావాదేవీల కు సంబంధించి అవక తవకలు జరిగి వుంటే కంపెనీ లా ట్రిబ్యునల్ లో తేల్చుకోవాల్సి వుండగా.. పక్కా స్కెచ్ తో అక్రమంగా క్రిమినల్ కేసులు పెట్టి రవి ప్రకాష్ వేధిస్తున్నారు. ఇప్పటికే రిమాండ్ లో వున్న రవిప్రకాష్ కి బెయిల్ వస్తుంది అని ముందుగానే ఊహించి తాజాగా మరో చిల్లర కేసు పెట్టి మళ్లీ 14 రోజులు రిమాండ్ కి పంపారు. ఈ పరిణామాలు అన్ని గమనిస్తే రవిప్రకాష్ నీ అంతమొందించేందుకు కుట్ర జరుగుతున్నదని స్పష్టమవుతుంది. రవి ప్రకాష్ కి ఎదైనా ప్రాణ హాని కలిగితే అందుకు తెలంగాణా
సి.ఎం కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నా ము. భవిష్యత్తులో జర్నలిస్టుల పై ఇలాంటి వేధింపులు పునరావృతం అయితే తెలంగాణ జర్నలిస్టులు అంతా ఏకం అయ్యి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము.

సతీష్ కమల్ ( తెలంగాణ మీడియా జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్)

కో కన్వీనర్ లు

బి. అమర్
కాండ్రేగుల. ప్రసాద్
రాజేందర్
డాక్టర్ విజయ్
మనోజ్ యాదవ్

 

Share on facebook
Share on twitter
Share on whatsapp