త్రివిక్రమ్, అల్లుఅర్జున్ కాంబినేషన్లో చాలా గ్యాప్ తరువాత వస్తున్న సినిమా అలవైకుంఠపురంలో. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది. అయితే అదే సమయంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ కూడా వస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు నుంచి వచ్చిన సాంగ్స్ దుమ్ములేపుతున్నాయి. మరో వైపు పోటా పోటీగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆఖరు ఘట్టం ప్రీరిలీజ్ ఈవెంట్ రానేవచ్చిదని. సరిలేరునీకెవ్వరు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని జనవరి 5 న నిర్వహిస్తున్నారు. అలవైకుంఠపురంలో ప్రీరిలీజ్ ఈవెంట్ జనవరి 6 న నిర్వహిస్తున్నారు. అయితే మహేష్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వస్తున్నారని తెలుస్తుంది. మరో వైపు అన్ని కుడితే ఎన్టీఆర్ కూడా వచ్చే అవకాశం ఉందట.
అయితే త్రివిక్రమ్ ఈ విషయంలో గట్టిగానే ప్లాన్ చేశాడని తెలుస్తుంది. తనకి ఎంతో సన్నిహితుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తీసుకురావాలని చూస్తున్నాడట. గతంలో అల్లుఅర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులాయి సినిమా కి పవన్ వచ్చాడు. అప్పుడు ఆ సినిమా మంచి హిట్ అందుకుంది. ఆ తరువాత s/o సత్యమూర్తి సినిమాకి పవన్ విషెస్ తెలిపారని త్రివిక్రమ్ అప్పట్లో చెప్పాడు. అదే సీన్ రిపీట్ చెయ్యాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడట. మరి పవన్ త్రివిక్రమ్ కోసం వస్తాడో రాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.