మాములుగా ఎవరైనా సరే పెళ్లిళ్లు చాలా ఘనంగా జరుపుకుంటారు. కొంచెం డబ్బులున్నవాళ్ళు మరికొంచెం గ్రాండ్గా జరుపుకుంటారు. పెళ్లి అంటే బంధువులు, చుట్టాలు, భోజనాలు, పెళ్లి పందిళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. మరి కొంత మంది తమ పెళ్లి ఎప్పటికి గుర్తుండిపోవటానికి ప్రీ వెడ్డింగ్ అంటే పెళ్ళికి ముందు ఫోటో షూట్ లు చేస్తుంటారు. ప్రీ వెడ్డింగ్ షూట్ లో సాధారణంగా ఏ బీచ్ లోనో లేక కొండల పైనో షూట్ చేస్తుంటారు. కానీ బురద తో నిండిన పొలాల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ మీరెప్పుడైనా చూసారా..కానీ ఈ జంట బహుశా వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ డిఫ్రెంట్ గా ఉండాలని బావించినట్టున్నారు. అందుకే ఇలా పొలాల్లో అది కూడా బురద ఎక్కువగా ఉన్న సమయంలో అందులోను రొమాంటిక్ గా ఫోజులిస్తూ ఫోటో లు దిగారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. చాలా బాగుందంటూ కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు.