నేటి ఆధునిక కాలంలో చాలా మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ముఖ్యంగా జీవనశైలిలో వస్తున్న మార్పులే ఈవ్యాధికి కారణమని ఎంతో మంది వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ తీసుకోకపొవడం, తినే ఆహారంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే చిన్న వయసులోనే చాలా మంది మధుమేహం వ్యాధి బారిన పడుతున్నారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే షుగర్ వ్యాధికి చెక్ పెట్టవచ్చంటున్నారు వైద్య నిపుణులు.
వ్యక్తి ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్ దోహదపడుతుంది. అలాగే వాకింగ్ చేయడం ద్వారా శరీరంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. నడక ద్వారా మధుమేహనికి అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు. వాకింగ్ ద్వారా రక్తంలోని చక్కెరను నియంత్రించడమే కాకుండా మధుమేహం వల్ల వచ్చే ఇతర ఇబ్బందులను కూడా తగ్గిస్తుంది. మధుమేహం ఆకస్మికంగా వచ్చే వ్యాధి కాదు.
క్రమంగా ఈ వ్యాధి శరీరంలో పెరుగుతూ ఉంటుంది. డయాబెటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది . దీని కోసం ఖరీదైన మందులు తీసుకోవలసిన అవసరం లేదు. రోజువారీ జీవనశైలి, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు. తినే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించవచ్చు. ఉదయం పూట కొన్ని వ్యాయామాలు చేయాలని, అలా చేయడం ద్వారా శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందంటున్నారు నిపుణులు. మధుమేహం వ్యాధిని కంట్రోల్ ఉంచడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం.
ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధానంగా కిడ్నీ సమస్య చాలామంది ఎదుర్కొంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా కిడ్నీలో చాలామందికి రాళ్లు పడుతున్నాయి. అయితే అవి కరిగించుకోడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. వేలకు వేలు ఆస్పత్రులకు తగలేయాల్సి వస్తోంది. ఈ సమస్యకు మారుతున్న జీవన శైలే కారణం. మనిషి శరీరంలో అత్యంతమైన ముఖ్యమైన వాటిలో మూత్రపిండాలు ఒకటి. పక్కటెముక దిగువన వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి, వ్యర్థ పదార్థాలను తొలగించడానికి, శరీరంలోని ద్రవం, ఎలక్ట్రోలైట్‌లు యాసిడ్-బేస్ బ్యాలెన్స్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. మనిషి పూర్తి ఆరోగ్యంగా ఉండేందుకు సహాయ పడతాయి.
ఆరోగ్యవంతమైన కిడ్నీలు కావాలి అంటే ఈ ఏడు రూల్స్ పాటించాలి అంటున్నారు నిపుణులు.. సాధారణ శారీరక శ్రమ, నడక, పరుగు, సైక్లింగ్ లేదా డ్యాన్స్ అయినా మీ సాధారణ ఆరోగ్యానికి గొప్పది. రక్తపోటును తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో ముఖ్యమైనవి. అలాగే డయాబెటిక్ పేషెంట్లకు బ్లడ్ షుగర్స్ అదుపుతప్పితే కిడ్నీ పాడయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ రోగుల కిడ్నీలు వారి రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి అదనంగా కష్టపడవలసి వస్తుంది. సంవత్సరాల తరబడి బ్లడ్ షుగర్ కొనసాగితే మూత్రపిండాలకు కోలుకోలేని నష్టానికి దారి తీస్తుంది. షుగర్‌లను అదుపులో ఉంచుకుని, ఆ పరిధిలో ఉంచుకుంటే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది.
మధుమేహం లాగానే అధిక రక్తపోటు కూడా దీర్ఘకాలిక మూత్రపిండాల నష్టాన్ని కలిగిస్తుంది. మీ రక్తపోటు స్థిరంగా 140/90mm Hg కంటే ఎక్కువగా ఉంటే, రక్తపోటు ఉంటుంది. ఉప్పు తీసుకోవడం తగ్గించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సడలింపు పద్ధతులు వంటి జీవనశైలి మార్పులను సాధన చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా బరువును అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. ఊబకాయం ఉన్న వ్యక్తులు గుండె, మూత్రపిండాల వ్యాధులతో సహా అనేక ఆరోగ్య పరిస్థితులను అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సోడియం, ప్రాసెస్ చేసిన ఆహారం, రెడ్ మీట్ తక్కువగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మీ ఆహారంలో తృణధాన్యాలతో పాటు తాజా పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా ఉండాలి.
అలాగే ధూమపానం పొగాకు రక్తనాళాలను దెబ్బతీయడంతో పాటు అథెరోస్క్లెరోసిస్‌కు దారితీస్తుంది. మూత్రపిండాల ద్వారా రక్త ప్రసరణను తగ్గించడానికి దారితీస్తుంది, ఇది మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే వాటికి దూరంగా ఉండాలి. అలాగే ఇబుప్రోఫెన్, నాప్రోక్సెన్, మెఫెనామిక్ యాసిడ్, డిక్లోఫెనాక్, అసెక్లోఫెనాక్ వంటి NSAIDల తరగతికి చెందిన పెయిన్ కిల్లర్‌లకు దూరంగా ఉండాలి. ఈ మందులు క్రమం తప్పకుండా తీసుకుంటే మీ మూత్రపిండాలు దెబ్బతింటాయి.
ఆరుబయట పని చేస్తున్నట్లయితే, ద్రవం పుష్కలంగా త్రాగండి. క్రమం తప్పకుండా నీరు త్రాగడం వల్ల మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు. మీ శరీరం నుండి అదనపు సోడియం, వ్యర్థ పదార్థాలను తొలగించడానికి మూత్రపిండాలకు సహాయపడుతుంది. కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి.