రాజకీయాల్లో సెంటిమెంట్లకు ఉండే ప్రాధాన్యతే వేరు. ఎంత బలం, బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కొన్ని లెక్కలు వర్కవుట్ అయితేనే గెలుస్తామని అభ్యర్థులు నమ్ముతుంటారు. అలా దుబ్బాక సెంటిమెంట్ ప్రకారం.. సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు పొలిటికల్ లెక్కల మాస్టర్లు.
సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ తరపున రఘునందన్ రావు మినహా అన్ని ప్రధాన పార్టీల నుంచి కొత్త అభ్యర్థులే పోటీ చేశారు. టీఆర్ఎస్ నుంచి రామలింగారెడ్డి సతీమణి, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ఎన్నికల్లో పోటీ చేయడం అదే తొలిసారి. అయితే వారిద్దరూ ఓటమిపాలయ్యారు. గతంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన రఘునందన్ రావే.. ఈసారి కూడా అదేే పార్టీ నుుంచి పోటీ చేసి చివరికి గెలిచారు. సాగర్‌లో కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అయితే కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.
టీఆర్ఎస్, బీజేపీ.. ఈసారి గతంలో పోటీ చేసిన అభ్యర్థులకు కాకుండా కొత్తవారికి టికెట్ ఇవ్వాలని భావిస్తున్నాయి. దీంతో వీరిలో జానారెడ్డి ఒక్కరు మాత్రమే మళ్లీ పోటీపడుతున్న క్యాండిడేట్ అవుతారు. అలా చూస్తే .. దుబ్బాక లెక్కనుబట్టి ఆయనే గెలుస్తారన్నది కొందరి వాదన. చూడాలి మరి ఆ మ్యాజిక్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో.