మెడికల్ విద్యార్థిని ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని బీఎస్పీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పేద వర్గం నుంచి వచ్చిన వారు మెడికల్ కాలేజీలో పేద వర్గాల వారు చదవకూడదా? డాక్టర్స్ అవ్వకుడదా అంటూ ఆయన ప్రశ్నించారు. కొన్ని పార్టీలు ప్రీతి కేసుకు మతం రంగు పులుముతున్నాయని విమర్శించారు.
దీనిని లవ్ జిహాద్ అని అనడం కరెక్ట్ కాదని అన్నారు. బండి సంజయ్ కొడుకు కూడా జూనియర్ ని కొట్టారు.. అప్పుడు మాట్లాడని సంజయ్ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడని ప్రశ్నించారు. ఘటన జరిగిన రోజు 4.30 నుంచి 8 గంటల వరకు ఏం జరిగిందన్న దానిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టాలన్నారు.
ముందుగా హెచ్ వోడీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పీజీ స్థాయిలో కాదు.. ప్రగతి భవన్ లోనే ర్యాగింగ్ ఉందన్నారు. కనిపించని ర్యాగింగ్ ఉంటుందని…బెదిరింపులు ఉన్నాయని పేర్కొన్నారు. ర్యాగింగ్ ఎలా ఉంటుందో.. తాను కూడా చూశానని పేర్కొన్నారు.
ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఎక్మో వెంటిలేటర్ పై నిమ్స్ డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. శుక్రవారం ప్రీతికి సీపీఆర్ చేసి గుండె పని తీరును మెరుగుపరిచారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. ఎక్మో వెంటిలేటర్ డయాలసిస్ తో మెయింటెన్ చేస్తున్నామని నిమ్స్ సూపరిండెంట్ అన్నారు. అయితే వైద్య బృందం నిశితంగా పర్యవేక్షిస్తుందని చెప్పారు. ప్రీతిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.