భువనగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ముందు ఓ రోగి బంధువులు ఆందోళనకు దిగారు. మరణించిన మహిళ మృతికి ఆసుపత్రి వైద్యులే కారణమని ధర్నా చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే…?
ఏడాది క్రితం రాయగిరికి చెందిన మహిళకు భువనగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవం చేశారు. అప్పుడు ఆపరేషన్ చేయాల్సి రావటంతో… ఆపరేషన్ చేశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. అయితే, కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ తీవ్ర కడుపునొప్పితో బాధపడింది. ఏడాదిగా కడుపు నొప్పిగా ఉందంటూ ఎన్నో ఆసుపత్రులు కూడా తిరిగారు. అయితే, ప్రస్తుతం గర్భిణీ అయిన ఆమె చికిత్స కోసం హైదరాబాద్ వచ్చింది. వైద్యులు అన్ని పరీక్షలు చేయగా కడుపులో దూది ఉన్నట్లు గుర్తించారు. విషయం ఆరా తీయగా తొలి కాన్పు సమయంలో ఆపరేషన్ చేసిన వైద్యులు దూది మర్చిపోయినట్లు తేల్చారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఆ దూది కడుపులో ఎక్కువ రోజులుండటంతో పేగులు దెబ్బతిన్నాయని వైద్యులు చెప్పటంతో… మహిళ బంధువులు తొలి కాన్పు చేసిన భువనగిరి ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు.