పథకాల పంపిణీ అని చెప్పి గడ్డి పీకిస్తున్నారు
నిండు గర్భిణీతో చేయరాని పని
అధికారుల తీరుతో పారిపోతున్న వలంటీర్లు
విజయవాడ: కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం బోళ్లపాడు గ్రామంలో వలంటీర్ల చేత గ్రామస్థాయి అధికారులు గడ్డి పీకిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ చేరవేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థని నియమించింది. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి చేరవేసేందుకు ఇంటింటా సర్వే చేస్తున్న గ్రామ వలంటీర్లతో ఇంకా ఏం పని చేయించాలా అని వినూత్నంగా ఆలోచించిన అధికారులు ప్రస్తుతం వారికి అంతగా పని లేకపోవడంతో రోడ్డు పక్కన గడ్డి పీకించి పిచ్చి చెట్లను నరికించారు.
వలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనం ఐదు వేలు. పని మాత్రం ఊరంతా చాకిరీ. అధికారుల ఒత్తిడి దానికి అదనం. ఈ వలంటీర్ల ఉద్యోగం మాకొద్దు అంటూ ఇప్పటికే చాలా చోట్ల చిరుద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే నియమింపబడిన వారిలో 30 శాతం మంది పారిపోయారు. ఉన్న వారితోనైనా అధికారులు పని సక్రమంగా పని చేయిస్తున్నారా అంటే అదీ లేదు. పారిశుద్ధ్య కార్మికుల్లా భావిస్తూ వారిచేత నానా వెట్టిచాకిరి చేయిస్తున్నారు. ఊళ్లో ఒకామె నోరట్టుకుని పడిపోవడంతో ఒక గ్రామ వలంటీర్ ఆత్మహత్య చేసుకోవడంతో ఇప్పుడు ఈ నియామకాలపై అందరి దృష్టీ పడింది.