టక్ జగదీష్ తో లక్ టెస్టు చేసుకోబోతున్న న్యాచురల్ స్టార్ నాని… శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నాడు. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా వస్తున్న ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ ఉండనున్నారు. ఇందులో సాయి పల్లవి, క్రితీ శెట్టిలను ఇప్పటికే సెలక్ట్ చేయగా… మూడో హీరోయిన్ పై ఉత్కంఠగా కొనసాగించారు.
రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో తెరకెక్కున్న ఈ సినిమాలో ప్రేమమ్ హీరోయిన్ మడొన్నా సెబాస్టిషన్ ను మూడో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. అతి తక్కువ సమయం ఉండే రోల్ ఆమెదని, ఇటీవలే తను ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. నిజానికి ప్రేమమ్ తర్వాత తెలుగు చిత్రాలను మడొన్నా ఒప్పుకోలేదు. తమిళ్, మలయాళం చిత్రాలకే పరిమితం అయ్యారు.
శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ జనవరి నుండి ప్రారంభమై, దీపావళికి రిలీజ్ కానుంది.