దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విద్యుదీకరణ పనులను వేగవంతంగా చేపట్టారు. ముఖ్యంగా చివరి దశలలో ఉన్న పనులపై ప్రత్యేక దృషి పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తం 770 రూట్ కిలోమీటర్ల రైల్వే విద్యుదీకరణ పనులు పూర్తి చేసినట్టు అధికారులు వెల్లడించారు. అయితే.. ఇది జోన్ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డు అని అంటున్నారు నిపుణులు.
ఈ మిషన్ ఎలక్ట్రిఫికేషన్ కు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రత్యేక దృష్టి సారించడంతో.. 2021- 22 సంవత్సరంలో తన నెట్‌వర్క్ పరిధిలో మునుపెన్నడూ లేనివిధంగా విద్యుదీకరణ పనులను పూర్తి చేసింది దక్షిణ మధ్య రైల్వే. కాగా.. తెలంగాణలో 326 కిమీలు, ఆంధ్రప్రదేశ్‌లో 331 కిమీలు, మహారాష్ట్రóలో 87 కిమీలు, కర్ణాటకలో 27 కిమీలు ఉన్నట్టు స్పష్టం చేశారు.
రైల్వే లైన్ల విద్యుదీకరణతో రైలు ఇంజన్ మార్పు చేయవలసిన అవసరం లేకపోవడంతో.. సెక్షనల్ సామర్థ్యం మెరుగుపడుతోందని వెల్లడించారు. ఈ సెక్షన్లలో మరిన్ని రైళ్లను నడిపించడానికి అవకాశాలు పెరుగుతాయంటున్నారు. విద్యుదీకరణ పనుల నిర్వహణలో అంకితభావంతో శ్రమించిన జోన్ సిబ్బంది, అధికారుల బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ప్రత్యేకంగా అభినందించారు.
సంబంధిత ప్రాజెక్టుల విద్యుదీకరణ పనులలో రైల్వే.. రైల్వే విద్యుదీకరణ సిబ్బంది సమన్వయంతో సహాయ సహకారాలను అందిపుచ్చుకోవడంపై కూడా జనరల్ మేనేజర్ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్‌లో అధిక భాగం విద్యుదీకరించబడిరదని పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఈ జోన్ 100 శాతం విద్యుదీకరణను సాధించడంలో తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అరుణ్ కుమార్ జైన్.