విపక్షాల తరఫున రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడ్డ యశ్వంత్ సిన్హా హైదరాబాద్ లో అడుగుపెట్టారు. బేగంపేట ఎయిర్ పోర్టులో దిగిన ఆయనకు సీఎం కేసీఆర్ తో పాటు రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు, శాలువాలతో వెల్ కమ్ చెప్పారు.
బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఖైరతాబాద్ మీదుగా జలవిహార్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించింది టీఆర్ఎస్. ర్యాలీతో సిన్హాను సమావేశానికి తీసుకెళ్లారు. జలవిహార్ లో సిన్హాకు మద్దతుగా టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశం ఏర్పాటు చేశారు.
అయితే.. 10వేల మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తామని టీఆర్ఎస్ శ్రేణులు గొప్పలు చెప్పినప్పటికీ బేగంపేట విమానాశ్రయం వద్ద అంతంతమాత్రంగానే కనిపించింది పరిస్థితి. వీవీఐపీ కాన్వాయ్ భారీగా కొనసాగింది తప్ప బైక్ ర్యాలీ నామమాత్రమేనని అంటున్నారు.
ర్యాలీ అనంతరం సమావేశంలో పాల్గొన్నారు సిన్హా, కేసీఆర్. మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చారు సిన్హా.