రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసోంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం ఆమె గౌహతిలోని కామాఖ్య అమ్మ వారిని ఆలయాన్ని సందర్శించారు.
అక్కడ అమ్మవారి దర్శనాన్ని చేసుకున్నారు. అనంతరం ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతితో పాటు ఆ రాష్ట్ర గవర్నర్ ప్రొఫెసర్ జగదీశ్ ముఖి, సీఎం హిమంత బిశ్వ శర్మతో పాటు పలువురు మంత్రులు అధికారులు దర్శనం చేసుకున్నారు.
దేశ అభివృద్ధిలో అసోం అభివృద్ధి చాలా కీలకమని ఆమె అన్నారు. అసోంతో పాటు ఇటీవల ఈశాన్య భారతంలో మౌళిక సదుపాయాలు పెరిగాయని పేర్కొన్నారు.
దీంతో అక్కడి ప్రజల జీవితాల్లో మార్పు వచ్చిందన్నారు. ఈశాన్య భారత్ లో రైలు, రోడ్డు, నీటి కనెక్టివిటీ బాగా పెరిగిందని పేర్కొన్నారు. మౌలిక వసతుల్ని అప్ గ్రేడ్ చేశామని వెల్లడించారు.