దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హోళీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోళీ ప్రజలకు నూతన ఆనందోత్సహాలను కలుగజేయాలని ఆకాంక్షిస్తు ట్వీట్ చేశారు. ఈ హోళీ ప్రజల జీవితాల్లో ఓ నూతన శక్తిని నింపాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
మరోవైపు ప్రధాని మోడీ కూడా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పండుగ ప్రజల జీవితాల్లో ఆనందాలు తీసుకు రావాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, పలువురు కేంద్ర మంత్రులు ప్రజలకు శుభాంకాంక్షలు తెలిపారు.
Advertisements
పశ్చిమబెంగాల్ లో సెక్స్ వర్కర్లు దుర్బర్ మహిళా కో ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో హోళీ వేడుకలు జరుపుకున్నారు. ‘ సెక్స్ వర్కర్లు అందరిలాగా బయటకు వెళ్లి ఇతర కమ్యూనిటీలతో హోళీ సంబురాలు చేసుకోలేరు. అందుకే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము” అని దుర్భర్ మహిళా సమాఖ్య కమిటీ అధ్యక్షురాలు విశాఖ లస్కర్ తెలిపారు.