హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం రానున్నారు. చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో నిర్వహించే శ్రీ రామానుజా చార్య సహ్రస్రాబ్ది సమారోహం కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ప్రత్యేక విమానంలో ఆదివారం ఆయన బేగంపేట విమానాశ్రయానికి మధ్యాహ్నం 2.20కు చేరుకోనున్నారు.
ప్రోటోకాల్ ప్రకారం విమానశ్రయంలో రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్ తదితరులు ఆహ్వానం పలకనున్నారు. అనంతరం ఆయన ముచ్చింతల్ చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన 120 కిలోల రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ముచ్చింతల్ లోని ఆలయాలు, బృహాన్‌మూర్తి విగ్రహాన్ని రాష్ర్టపతి సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం అక్కడ ఉత్సవాల్లో పాల్గొననున్నారు
ఇప్పటికే ముచ్చింతల్ లో నిర్వహిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తాజాగా రాష్ట్రపతి వస్తుండటంతో పోలీసులు అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఆయన రాక నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ముచ్చింతల్ శ్రీ రామానుజ జీయర్ ఆశ్రమం వైపు మార్గంలో ఎవరినీ అనుమతించబోయని అధికారులు తెలిపారు.