మహరాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు రంగం సిద్ధమయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మూడో అతిపెద్ద పార్టీ అయిన ఎన్సీపికి అవకాశమిచ్చారు గవర్నర్ కోశ్యారీ. రాత్రి 8.30వరకు ఎన్సీపీకి సమయమున్నప్పటికీ… ఎన్సీపికి కూడా పూర్తి మెజారిటీ లేనందున రాష్ట్రపతిపాలనకు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అతిపెద్ద పార్టీలుగా అవతరించిన బీజేపీ, శివసేనలకు గవర్నర్ అవకాశం ఇచ్చారు . కానీ ఆ రెండు పార్టీలకు పూర్తి మెజారిటీ లేనందున ఆ రెండు పార్టీలు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాయి. అయితే, శివసేన-ఎన్సీపి-కాంగ్రెస్ కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కసరత్తులో ఉండగానే గవర్నర్ రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. కేంద్ర క్యాబినెట్ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.