ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఒడిశా భవన్ నుంచి ఆమె కొద్ది సేపటి క్రితం పార్లమెంట్ కు బయలు దేరారు.
\
నామినేషన్ పత్రాలు దాఖలు చేసే ముందు ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను గురువారం ఆమె కలిశారు. మరి కొద్ది సేపట్లో ఆమె ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగుతారని బీజేపీ శ్రేణులు తెలిపాయి.
ఆమె రాక సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేశారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, బీజేపీ కార్యకర్తలు ఆమెకు ఎయిర్ పోర్టులో స్వాగతం పలకనున్నారు.
ఆమె నామినేషన్ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.