విశాఖ సాగర తీరంలో 12వ ఎడిషన్ ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. ఐఎన్ఎస్ సుమిత్ర నౌకలో విహరిస్తూ నౌకాదళ శక్తి సామర్థ్యాల్ని సమీక్షించారు.
గగనతలంలో రామ్ నాథ్ కోవింద్ కు సెల్యూట్ చేస్తూ ఎయిర్ క్రాఫ్టులు చేసిన విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ విన్యాసాల్లో 10 వేలమందికి పైగా నావికా సిబ్బంది పాల్గొన్నారు.
ముందుగా భారత నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలు పైకి ఎగురుతూ రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించాయి. 60 యుద్ధ నౌకలతోపాటు సబ్ మెరైన్స్, 50కిపైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నాయి.
ఫ్లీట్ రివ్యూ సందర్భంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ లో రాష్ట్రపతి 21 గన్ సెల్యూట్ అందుకున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి.