సిలికాన్ ఆంధ్ర యూనివర్శిటీకి అరుదైన గౌరవం దక్కింది. యూనివర్శిటీకి ప్రతిష్టాత్మక వెస్ట్రన్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్- వాస్క్ గుర్తింపు దక్కింది. ఉత్తర అమెరికాలో భారతీయ విలువలతో నడుస్తున్న యూనివర్శిటీకి వాస్క్ గుర్తింపు రావటం ఇదే ప్రథమం.
ఇది ప్రతి ఒక్క భారతీయుడికి అరుదైన గౌరవంగా భావిస్తున్నామని… యూనివర్శిటీని మరింత గొప్పగా తీర్చిదిద్దుతామని సిలికాన్ ఆంధ్ర యూనివర్శిటీ ప్రకటించింది.