ఫిలింనగర్ హనుమాన్ గుడి విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటున్నాయి వీహెచ్పీ, భజరంగ్ దళ్. మంగళవారం శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ పీఎస్ కు తరలించారు. వారిలో ఆరుగురు స్వామీజీలు కూడా ఉన్నారు. అయితే పోలీస్ స్టేషన్ దగ్గర వీహెచ్పీ, భజరంగ్ దళ్ నాయకులతో కలిసి స్వామీజీలు దీక్షకు దిగారు.
తొలగించిన హనుమాన్ విగ్రహాన్ని, గుడిని తిరిగి నిర్మించే వరకు గోషామహల్ పీఎస్ లోనే ఉంటామంటూ దీక్ష చేస్తున్నారు. వందల కోట్ల విలువైన భూమిని కాజేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అందుకే రాత్రికి రాత్రి హనుమాన్ విగ్రహాన్ని తొలగించి, ఉదయం పోలీసులను పెట్టి అక్కడికి ఎవరినీ రాకుండా అడ్డుకున్నారని చెప్పారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించే వరకు తమ దీక్ష కొనసాగుతుందని స్పష్టంచేశారు స్వామీజీలు.