హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఫిలింనగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హనుమాన్ ఆలయం తొలగింపు పై పెద్ద ఎత్తున హిందూ సంఘాలు, స్వాములు ఫిలింనగర్ కు చేరుకున్నారు. అయితే వారిని అడ్డుకున్న పోలీసులను సైతం నెట్టేసి హిందు సంఘాలు దూసుకెళ్లడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కాసేపు పోలీసులకు హిందూ సంఘాలకు మధ్య తోపులాట జరిగింది. కాగా పోలీసుల సమక్షంలో ఓ యువకుడు పెట్రోల్ పోసుకున్నాడు. అలాగే మరో150 మంది హిందూ సంఘాల కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.