బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాలు నిన్న ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. రెండు రోజులు పాటు జరిగిన ఈ సమావేశాలు ఈ రోజుతో పూర్తయ్యాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ సమావేశాలను నిర్వహించారు.
ఈ సమావేశాలకు ప్రధాని మోడీ నిన్న రోడ్ షో ద్వారా వచ్చారు. ఈ రోజు సమావేశాలకు కూడా ప్రధాని మోడీ హాజరయ్యారు. సమావేశాల ముగింపు సందర్బంగా ప్రధాని మోడీ మాట్లాడారు. పార్టీ కార్యకర్తలకు, నేతలకు ఆయన ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలని ఆయన సూచించారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా కేవలం 400 రోజులు మాత్రమే మిగిలి వున్నాయని ఆయన గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో దక్షిణాదిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆయన సూచించారు.
ఇక, బీజేపీకి ప్రతిష్టాత్మకమైన జాతీయ కార్గవర్గ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర గురించి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోడీ ప్రస్తావించారు.