ప్రధాని నరేంద్రమోడీ మూడు రోజుల అమెరికా పర్యటనకు వెళ్లారు. క్వాడ్ సదస్సులో పాల్గొనటంతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని భేటీ కాబోతున్నారు. ఈ టూర్ లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, ఆస్ట్రేలియా ప్రధానితోనూ మోడీ సమావేశం కాబోతున్నారు.
ప్రధాని ఈ టూర్ కోసం అత్యాధునిక సాంకేతికతో తయారు చేసిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉపయోగించారు. క్షిపణి దాడులను సైతం ఈ ఫ్లైట్ తట్టుకోగలదు. కరోనా వైరస్ తర్వాత ప్రధాని తొలి అంతర్జాతీయ ప్రయాణం ఇదే. ప్రధాని వెంట భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు.
అయితే, అమెరికా వెళ్తున్న సమయంలోనూ ప్రధాని ఫైల్స్ తిరగేస్తూ, అధికారులతో మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది.