నరసాపురం ఎంపీ, వైసీపీ నేత రఘురామకృష్ణంరాజును ప్రధాని మోడీ అప్యాయంగా పలకరించి… భుజం తట్టారు. పార్లమెంట్ ఆవరణలో రాజ్యసభలోకి ప్రధాని మోడీ వెళ్తున్న సమయంలో… ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రధాని మోడీకి నమస్తే సార్ అంటూ విష్ చేయగా, కమెండోలను పక్కకు జరిపి మరీ… ఎంపీని పలకరించారు మోడీ.
ప్రధాని మోడీ పిలుపుతో ఆనందంతో ఆయనకు పాదాభివందనం చేశారు. మోడీ కూడా రాజుగారు అంటూ ఎంపీతో కరచాలనం చేశారు. నవ్వుతూ భుజం తట్టి ఆప్యాయంగా పలకరించారు. దీంతో అక్కడున్న ఇతర వైసీపీ ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి చూస్తూ ఉండిపోయారు.
గత కొంతకాలంగా వైసీపీ సూచనలను కాదని, అధిష్టానంతో దూరంగా ఉంటున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీని అందులోనూ మొదటిసారి గెలిచిన ఎంపీని ప్రధాని పేరు పెట్టి పిలుస్తూ, ఆప్యాయంగా పలకరించటంలో ఏదో ఉందంటూ వైసీపీలో చర్చ నడుస్తోంది.