ప్రధాని నరేంద్రమోడీ మూడు రోజుల అమెరికా పర్యటనకు వెళ్లారు. వాషింగ్టన్ లో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా చేరిన ప్రధాని మొదటి రోజు నుండే బిజీబిజీగా గడపనున్నారు.
మొదటి రోజు ప్రధాని ఆస్ట్రేలియా ప్రధానితో పాటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్, గ్లోబల్ సీఈవోలతో సమావేశం కాబోతున్నారు. భారత్ తో సంబంధాలు, రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలు, ఇండియాలో పెట్టుబడులకు సంబంధించి ప్రధాని చర్చలు జరపనున్నారు. ఈ చర్చల సందర్భంగా ఆప్ఘనిస్తాన్ లో ఉన్న పరిస్థితులు, తాలిబన్ల ప్రభుత్వంపై తీసుకోవాల్సిన స్టాండ్ పై కూడా చర్చలు జరిగే అవకాశాలున్నాయి.
2014లో మోడీ ప్రధాని అయ్యాక అమెరికాలో పర్యటించటం ఇది 7వసారి.