రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, అతని భార్య శ్లోకా మెహతాకు ఇటీవల కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అంబానీల ఫ్యామిలీ వెల్లడించింది. ముకేష్ అంబానీ తన మనవన్ని ఎత్తుకుని మురిసిపోతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆయన మనవన్ని చూసేందుకు ప్రధాని మోదీ ముంబైలోని రిలయన్స్ హాస్పిటల్‌కు వెళ్లారని చెబుతూ ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ముకేష్ అంబానీ మనవడిని చూసేందుకు ప్రధాని మోదీ ముంబైలోని వారి హాస్పిటల్‌కు వెళ్లారని ఒక ఫొటోను కొందరు వైరల్ చేస్తున్నారు. అయితే దీన్ని వెరిఫై చేసి చూడగా.. అది ఫేక్ వార్త అని తేలింది. నిజానికి ఆ ఫొటో 2014లోది. అప్పట్లో ముంబైలో రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌ను ప్రారంభించేందుకు మోదీ అక్కడికి వెళ్లారు. అయితే అదే ఫొటోను కొందరు ఇప్పుడు మిర్రర్ చేసి తప్పుడు వార్తను ప్రచారం చేస్తున్నారు.
తాజాగా ప్రచారమవుతున్న వార్తలో.. ముకేష్ అంబానీ మనవడిని చూసేందుకు ప్రధాని మోదీకి టైం దొరికింది కానీ ఢిల్లీలో చలికి ఆందోళన చేస్తున్న రైతుల బాధ పట్టదా.. అని ఉంది. అయితే ఆ ఫొటో నిజమే కానీ.. అది పాతది. ఇక ఆ వార్త ఫేక్ అని తేలింది. పాత న్యూస్‌కు చెందిన ఫొటోను మిర్రర్ చేసి దానికి తప్పుడు సమాచారం జత చేసి కొందరు దాన్ని వైరల్ చేస్తున్నారని వెల్లడైంది. అందువల్ల ఆ వార్త అబద్ధమని తేలింది.