ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది. సిక్కు గురువు గురు తేగ్ బహదూర్ 400వ ప్రకాష్ జయంతి సంరద్భంగా గురువారం జాతినుద్దేశించి ఆయన ప్రసంగిస్తారని పేర్కొంది. తేగ్ బహదూర్ స్మారకార్థం నాణెంతో పాటు పోస్టల్ స్టాంపును విడుదల చేయనున్నారని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ శుభసందర్భంలో 400 మంది సిక్కు సంగీతకారులు షాబాద్ కీర్తనలను ఆలపిస్తారని మంత్రిత్వశాఖ తెలిపింది.
ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ, కేంద్ర సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 20, 21 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నట్టు తెలుస్తోంది. బుధవారం హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో యువత నేతృత్వంలో లైట్ అండ్ సౌండ్ ప్రదర్శనలతో పాటు.. షాబాద్ కీర్తన కూడా ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా 400 మంది గాయకులతో షాబాద్ కీర్తనను ప్రదర్శిస్తారు. రాగి శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ సూచనల మేరకు వివిధ రాగాలలో శ్లోకాలు సంగీతకారుడు శ్లోకాలు పఠించనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న గురు తేగ్ బహదూర్ జయంతి వేడుకల్లో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు.
అంతేకాకుండా దేశ, విదేశాల నుంచి అనేకమంది ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొంటారని వెల్లడించింది కేంద్ర మంత్రిత్వశాఖ. అంతేకాకుండా విదేశాలకు చెందిన ఇతర ప్రముఖులు ఈ వేడుకలలో పాల్గొంటారని తెలిపింది.