యూపీలో బీజేపీ సర్కార్ ఘన విజయం సాధించిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీ వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పథకాలను ఆయన శంకు స్థాపన చేశారు.
లక్ష మందికి వంట చేయగల సామర్థ్యం గల మెగా కిచెన్ ను అక్షయ పాత్ర సంస్థ ఇటీవల యూపీలోని వారణాసిలో ఏర్పాటు చేసింది. తాజాగా ఈ కిచెన్ ను ప్రధాని మోడీ గురువారం ప్రారంభించారు.
భారీ సామర్థ్యం గల ఇలాంటి కిచెన్ లతో విద్యార్థులకు చాలా మేలు జరుగుతుందన్నారు. తన నియోజకవర్గం వారణాసిలో ప్రజల మధ్య గడపడం తనకెప్పుడూ ఆనందాన్ని కలిగిస్తుందన్నారు.
సుమారు 24 కోట్లతో ఈ కిచెన్ ను నిర్మించినట్టు అధికారులు తెలిపారు. ఇందులో వంట కోసం గ్యాస్, సోలార్ ఎనర్జీని ఉపయోగిస్తున్నారు. ఇందులో ఏర్పాటు చేసిన రోటీ మేకర్ మిషిన్ తో ఒక గంటలో 40వేల రోటీలను తయారు చేయవచ్చని అధికారులు వెల్లడించారు.