ప్రధాన మంత్రి భద్రత అనేది దేశానికి అత్యంత కీలకం. ప్రధాన మంత్రి భద్రత విషయంలో ఎక్కడ రాజీపడినా సరే ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అది అమెరికా అధ్యక్షుడు అయినా భారత ప్రధాని అయినా సరే భద్రత విషయంలో పొరపాట్లు దోర్లకూడదు. ఇక ప్రధాని భద్రతలో ఉండే వాళ్ళు చాలా వరకు నల్ల చలువ కళ్ళద్దాలు పెట్టుకుని విధులు నిర్వహిస్తూ ఉంటారు.
ప్రధాని భద్రతను చూసే వాళ్ళను ‘ స్పేషల్ ప్రోటెక్షన్ గ్రూప్’ అని పిలుస్తూ ఉంటారు. ఇక వాళ్ళు కళ్ళ జోడు నల్లది ఎందుకు పెట్టుకుంటారో ఒకసారి చూస్తే… వాళ్ళు ఎటువైపు, ఎవరిని చూస్తున్నారో తెలియకుండా ఉండటం కోసం వాటిని ధరిస్తారు. దుమ్ము, ఎండ, బలమైన గాలి కారణంగా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా వాటిని పెట్టుకుంటారు. కాబట్టి ఏ పరిస్థితిలో అయినా సరే కళ్ళకు ఇబ్బంది ఉండదు.
ఇక నల్ల చలువ అద్దాలు ధరిస్తే మాత్రం కను రెప్పులు ఎక్కువ వేసే అవకాశం ఉండదు. అదే విధంగా ప్రమాదం జరిగిన సమయంలో కంటికి ఎక్కువగా రక్షణ ఉంటుంది. ఏదైనా అనుకోని సంఘటన అంటే బాంబు పేలుడు లాంటివి జరిగితే అధికంగా కాంతి ప్రసరిస్తుంది. ఆ సమయంలో చూపు వేగంగా తిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని ధరిస్తారు.